జీవితంలో సంతోషంగా ఉండాలంటే సానుకూల శక్తి ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే జీవితంలో ప్రతికూల శక్తి పెరుగుతుందో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక సంతోషంగా జీవించాలంటే తప్పకుండా కొన్ని పరిష్కారాలను పాటించాలి. వీటిని పాటించడం వలన జీవితంలో ఎన్నో ఇబ్బందులను తగ్గించుకొని ఆనందంగా ఉండవచ్చు. సహజంగా ఉప్పును వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఉప్పుని ఉపయోగించి జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు వంటివి తొలగిపోతాయి. ముఖ్యంగా నరదృష్టి వంటి సమస్యలను తగ్గించడానికి ఉప్పు ఎంతో సహాయం చేస్తుంది.
అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే నీళ్లలో ఉప్పును వేసి ఈశాన్యం వైపు పెట్టాలి. ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. దాంతో సంపద కూడా పెరుగుతుంది. మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటే ఈ పరిహారాన్ని తప్పక పాటించాల్సిందే. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పును వేసుకొని స్నానం చేయడం వలన మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. దీంతో ఒత్తిడి వంటి సమస్యలు తొలగిపోయి జీవితంలో సంతోషంగా ఉంటారు.
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతో అవసరం. అయితే ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు వేసి బీరువాలో పెట్టడం వలన ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎప్పుడైతే ఈ పరిహారాన్ని పాటిస్తారో లక్ష్మీదేవి కటాక్షం దక్కుతుంది. దీంతో ఎన్నో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. సహజంగా నరదృష్టికి సంబంధించిన సమస్యలు చాలా శాతం మంది ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటప్పుడు గుప్పెడు ఉప్పు తీసుకుని ఏడు సార్లు పై నుంచి కింద వరకు తిప్పాలి. ఇలా చేసిన తర్వాత నీళ్లలో వేయాలి. ఈ విధంగా చేయడం వలన జీవితంలో నరదృష్టి సమస్య తగ్గిపోతుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి.