నోవాటెల్ లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. నోవాటెల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కిన లిప్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. వాస్తవానికి 8 మంది ఎక్కాల్సిన లిప్ట్ లో ఏకంగా 13 మంది ఎక్కారు. ఓవర్ వెయిట్ కారణంగా ఆ లిప్ట్ మొరాయించింది. ఎక్కువ మంది ఎక్కడంతో ఉ:డాల్సిన ఎత్తు కంటే కిందికి దిగింది లిప్ట్.

దీంతో ఒక్కసారిగా అధికారులు టెన్షన్ పడ్డారు. అటు హోటల్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. లిప్ట్ ఓపెన్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వేరే లిప్ట్ లో పంపారు అధికారులు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి నోవాటెల్ లో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడ ఉన్న పలువురు నేతలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news