చిన్న పరిహారాలతో పెద్ద మార్పు.. కష్టాలు తీరుతాయి, సంపద పెరుగుతుంది

-

చాలా శాతం మంది జీవితంలో ఆర్థిక సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొన్ని రకాల మార్పులను మీ ఇంట్లో చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. కనుక వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను తప్పకుండా పాటించి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ప్రతిరోజు మీ ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వలన ఎన్నో ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోతుంది మరియు సానుకూల శక్తి పెరగడం వలన ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా జీవిస్తారు. చాలామంది ఆర్థిక సమస్యలు లేకపోయినా డబ్బులను అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటారు. దాంతో ఆర్థికంగా దృఢంగా ఉండలేరు.

ఎప్పుడైతే కర్పూరాన్ని పూజ గదిలో వెలిగించుతారో సానుకూల శక్తి పెరిగి ఎంతో సంతోషంగా ఉంటారు. కేవలం పూజ గదిలో ఉపయోగించడం మాత్రమే కాకుండా కర్పూరాన్ని లాకర్ లో కూడా పెట్టవచ్చు. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ఎక్కువ అవుతుంది. దీంతో ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండవచ్చు మరియు మీ ఆదాయం పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. కేవలం కర్పూరాన్ని వెలిగించడం మాత్రమే కాకుండా మీరు పడుకునేటువంటి గదిలో ఒక చిన్న గిన్నెలో కర్పూరాన్ని పెట్టవచ్చు. ఇలా పెట్టడం వలన మంచి నిద్రను పొందుతారు. ముఖ్యంగా భార్య భర్తలు మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా అవి తగ్గుతాయి మరియు ఎంతో ఆనందంగా ఉంటారు.

అదేవిధంగా మీ ఇంటి ముఖద్వారం వద్ద కూడా కర్పూరాన్ని పెట్టవచ్చు. ఇలా చేస్తే సానుకూల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. చాలా శాతం మంది వంటగదిలో కూడా కర్పూరాన్ని ఉంచుతారు. ఇలా చేయడం వలన మంచి సువాసన రావడంతో పాటుగా కీటకాలు వంటివి రాకుండా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఎప్పుడైతే కర్పూరాన్ని పెడతారో ఆహారానికి మరియు డబ్బుకి కొరత ఉండదు అని నిపుణులు చెప్తున్నారు. కనుక ఐశ్వర్యం పెరగాలి అంటే తప్పకుండా కర్పూరాన్ని ఈ విధంగా ఉపయోగించండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలకు దూరంగా ఉంటాయి మరియు ఎంతో ఆనందంగా జీవించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version