మంటల్లో ఇల్లు తగలబడుతున్నట్లు కల వచ్చిందా..అది అశుభమే..కానీ ఇలాంటి అగ్ని కలలు వస్తే మంచిదే..!

-

నిద్రలో మనకు రకరకాల కలలు వస్తాయి. అయితే కలలో అగ్ని కనిపిస్తే..చాలామంది దాన్ని పీడకలగా అనుకుంటారు. కలలో అగ్ని కనిపించడం కీడుకు సంకేతం కాదని స్వప్న శాస్త్రం ఆధారంగా పండితులు పేర్కొంటున్నారు. కలలో అగ్ని శుభమేనని వారు చెబుతున్నారు. మన పూర్వీకులు ధనం రావాలంటే అగ్ని దేవుడిని పూజించేవారు..అగ్నిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుందని పండితులు పేర్కొన్నారు. కలలో అగ్ని వేర్వేరు రూపాల్లో కనిపిస్తుంది. ఒక కాగడా రూపంలో గానీ, విచ్చిన్నంగా జ్వలిస్తున్నట్లు, ఒక దీపం రూపంలో, లేదా పెద్దగా ఇళ్లు, చెట్లు, లేదా మనిషి దహించుకుపోతున్నట్లుగా కలలో కనిపిస్తుంటుంది. ఇలా కనిపించటం వేటికి సంకేతమే ఈరోజు తెలుసుకుందాం.!

ఒక కాగడా రూపంలో ఎవరైనా మీ చేతికి అందించినట్లు కల వస్తే.. అది మంచిదేనట. అలా కనిపిస్తే మీకు విజయం కలుగుతుందని స్వప్నశాస్త్రం చెబుతోంది. చిన్న మంట రూపంలో కనిపించినా విజయానికి సంకేతమని అంటున్నారు. అలాగే మీ అప్పులు తీరిపోతాయట. ఇక స్వప్నంలో గనక అగ్ని కనిపిస్తే.. వివాహం కానివారికి పెళ్లి యోగ్యం కలుగుతుందట. సంతానం యోగం, ధన సంపాదన వంటివి కూడా జరుగుతాయట.

అగ్ని కలలోకి వస్తే చెడు ఫలితాలు ఎప్పుడు కలుగుతాయి..

కలలో అగ్ని కనిపించిన ప్రతిసారి మంచి జరుగుతుందని కాదు..కొన్నిసార్లు చెడు కూడా జరగవచ్చట. ఒకవేళ మన కలలో అగ్నికి ఊరు మొత్తం తగలబడిపోతున్నట్లు కనిపిస్తే.. అది అశుభ ఫలితమని పండితులు అంటున్నారు. అలాగే మీరు ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ అగ్ని అంటుకున్నట్లు కలలో కనిపిస్తే.. అప్పుడు మీరు అప్పుల వలయంలో చిక్కుకుంటారని, ఆపదల్లో చిక్కుకోబోతున్నారని ఆ కలకు అర్థం. తరచూ ఇలాంటి కలలు వస్తుంటే..రామాయణం ఉన్న త్రిజట స్వప్న వృతాంతం, లేదా స్కందుని ఆరాధన, ఈశ్వరాభిషేకం చేస్తే ఇలాంటి స్వప్నాలు రాకుండా ఉంటాయి. కలలు ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయని.. మీరు ఎక్కడైనా చూసిన అంశం గానీ, విన్నది గానీ, ఊహించింది గానీ కలలో వస్తే.. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని.. ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు.

గమనిక: పై కథనానికి ఎలాంటి ఆధారాలు లేవు. పాఠకులు ఆస్తకిని దృష్టిలో పెట్టుకుని స్వప్నశాస్త్రం ప్రకారమే మీకు ఈ సమాచారం అందించబడిందని గమనించగలరు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version