ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటారు. ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి. ఇంట్లో ఎప్పుడు కూడా లైటింగ్ చాలా తేలికగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఉంటే మంచి వైబ్రేషన్స్ వస్తాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ కాంతి ఉండే లైట్లను మాత్రం ఉపయోగించొద్దు. ఇంట్లో ఎప్పుడు కూడా కొన్ని రంగుల ప్రశాంతతను ఇస్తాయి. బ్రైట్ కలర్స్ కాకుండా కొంచెం లైట్ గా ఉండే వాటిని వేయించండి. ఇవి ప్రశాంతంగా ఉండేటట్టు చూస్తాయి. ఎప్పుడూ కూడా ఇంట్లో ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా ఇల్లు అందంగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా కూడా ఉండొచ్చు.
ఇంట్లో నాచురల్ లైటింగ్ ఉండేటట్లు చూసుకోండి. సూర్యుడు వెలుగు ఇంట్లో పడేటట్టు చూసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. మూడ్ కూడా బాగుంటుంది. వీటితో పాటుగా ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే కచ్చితంగా క్లీనింగ్ చేయించుకుంటూ ఉండండి. అరోమాతెరపి కూడా మంచి మూడ్ ఇస్తుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
మంచి సువాసనని ఇచ్చే స్ప్రే లేదా సువాసనిచ్చే మొక్కలు ఉపయోగించడం మంచిది. మంచి ఫ్యాబ్రిక్ తో కూడిన బెడ్ షీట్లు కటింగ్ లు వంటివి వేసుకోండి. ఇవి ప్రశాంతతని కలిగిస్తాయి. ఇంట్లో ఇంటీరియర్ కూడా ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో ఇంటీరియర్ బాగుంటే చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మ్యూజిక్ కూడా ప్రశాంతతని ఇస్తుంది హాయిగా ఉండడానికి అవుతుంది. ఇలా వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే ప్రశాంతంగా ఉండొచ్చు.