తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మంత్రి కొండా సురేఖ మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొలుత కొండా సురేఖ పై కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడంతో కొంత మంది నేతలు ట్రోలింగ్స్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కొండా సురేఖకు మద్దతుగా నిలిచారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించకపోవడంతో.. ఆయన అనుచరులే ట్రోలింగ్స్ చేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించింది. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్దం పెరిగింది. కొండా సురేఖ కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మరోవైపు నాగచైతన్య-సమంత విడాకులకు కారణం సమంతనేనని పేర్కొంది. నాగార్జున పై కూడా పలు ఆరోపణలు చేసింది. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు రేపు నాగార్జున ను కోర్టుకు హాజరు కావాలని.. ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేయనున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ తరపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున మీద కేసులు పెడతామని.. అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు. నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే వారందరి పై కేసులు వేస్తామని కొండా సురేఖ తరపు లాయర్ పేర్కొనడం విశేషం.