ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం పర్సు ఇలా ఉంటే.. డబ్బే డబ్బు..!

-

చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన ఎంతో లాభం ఉంటుంది. మనం అనేక రకాల వస్తువులను ధరిస్తూ ఉంటాం. పురుషులు పర్సులో వివిధ రకాల వాటిని పెట్టుకుంటూ ఉంటారు. డబ్బులు తో పాటుగా కొన్ని వస్తువులను కూడా పర్సులో ఉంచుతారు. స్త్రీలు అయితే హ్యాండ్ బ్యాగ్ ను చేతిలో పట్టుకుంటారు. అనేక వస్తువులు పెట్టుకుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇలా చేస్తే మంచిదట. ఇక వారికి తిరిగి ఉండదట. డబ్బే డబ్బు అని వాస్తు నిపుణులు అంటున్నారు. పర్సు ఎక్కువ కాలం మన్నేలా చూసుకోవాలి. ఎక్కువ రోజులు పాటు మీ దగ్గర ఒకే పర్సు ఉంటే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

కొందరు పర్సులో డబ్బు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, కాయిన్స్ వంటివి పెట్టుకుంటూ ఉంటారు.. అసలు వాటన్నిటినీ అడ్డదిడ్డంగా పెట్టుకోకూడదట. అలా చేయడం వలన దోషం కలిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయట. ఒక పద్ధతి ప్రకారం పర్సులో డబ్బులు కార్డులని పెట్టుకోవాలి. పర్సు రంగు కూడా చాలా ముఖ్యమైనది. పర్సును బట్టి కూడా వాస్తు దోషం ఏర్పడుతుంది. మీ రాశి ప్రకారం మీకు ఏ రంగు అయితే సరిపోతుందో ఆ రంగుకు సంబంధించిన పర్సుని మీరు ఉపయోగిస్తే చాలా మంచి జరుగుతుంది. పర్సులో కొంతమంది మితిమీరిన నగదు పెడుతుంటారు. అలా అస్సలు చేయకూడదు.

ఎంత అవసరమో అంత డబ్బును మాత్రమే ఉంచాలి. ఎక్కువగా పర్సులో డబ్బులు పెట్టుకోకూడదు. అలాగే పర్సును చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అది తప్పు. ఇంట్లో బీరువాలో లాకర్లో లేదా డబ్బులు దాచుకునే చోట మీ పర్సును పెట్టాలి అలా చేయడం వలన మంచి ఎనర్జీ ఉంటుంది. పర్సు పై స్వస్తిక్, గణేష్, హనుమాన్, లక్ష్మీదేవి వంటి బొమ్మల్ని వేయించుకుంటే చాలా మంచిదట. ఇలా చేయడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందట. చిరిగిపోయిన పర్సును వాడకూడదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. పురుషులైనా, స్త్రీలైనా పర్సును ఉపయోగించేటప్పుడు ఈ నియమాలు పాటించడం మంచిది. అప్పుడు చక్కటి మార్పు కనబడుతుంది. ఈసారి మీరు కూడా మార్చి చూడండి. మార్పుని గమనిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news