ఇంట్లో అరటిచెట్టు ఈ ప్రదేశంలో ఉంటే కుటుంబంలో కలహాలు రావడం ఖాయమే..!!

-

హిందువులు చాలా చెట్లను దైవంగా భావించి పూజిస్తారు..కొన్నింటిని ఇళ్లలో కూడా పెంచుకుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి అరటిచెట్టు. అరటి చెట్టులో విష్ణువు ఉంటాడని చాలామంది విశ్వసిస్తారు. అరటి చెట్టును నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కానీ, అరటి చెట్టును తప్పుడు ప్రదేశంలో నాటితే అది అనేక అనర్ధాలకు దారితీస్తుందని చాలా మందికి తెలియని విషయం…తప్పు ప్రదేశంలో అరటి చెట్టు నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సుకు బదులుగా పేదరికం ఆవహిస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. అరటి చెట్టును ఆగ్నేయ దిశలో అంటే అగ్ని కోణంలో నాటకూడదు.. అగ్ని కోణంలో అరటి చెట్టును నాటడం అశుభమని వాస్తు శాస్త్రం చెబుతుంది.. అరటి చెట్టుకు ముళ్ల చెట్ల మొక్కలను నాటకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో తగాదాలు వచ్చి బంధం చెడిపోతుందట. చెట్లు, కాక్టస్ వంటి మొక్కల దగ్గర అరటిని నాటడం అస్సలు మంచిది కాదు.

ఇంటి ప్రధాన ద్వారం ముందు అరటి చెట్టును నాటడం కూడా మంచిది కాదు. ప్రధాన ద్వారం పడేలా అరటి చెట్టును నాటడం ప్రతికూలతను కలిగిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద నాటిన అరటి చెట్టు శ్రేయస్సుకు ఆటంకంగా మారుతుందట..

వాస్తు ప్రకారం.. అరటి చెట్టును నాటడం చాలా శ్రేయస్కరం. అరటి చెట్టును నాటడం, పూజించడం ద్వారా విష్ణువు, లక్ష్మీ దేవీని ప్రసన్నం చేసుకోవచ్చు.. కానీ కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే అది అశుభ ఫలితాలను కలిగిస్తుంది. అరటి చెట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెట్టు, దాని ఆకులు ఎండిపోకుండా ప్రతిరోజూ దానికి నీరుపట్టాలి. అరటి చెట్టును ఏ మురికి ప్రదేశంలో ఉంచకూడదు. మురికి నీరు కూడా పోయకూడదు, అలా చేయడం హానికరం.

ఏ ప్రదేశాల్లో నాటకూడదు అనేది మాత్రం అందించాం.. మీరు ఇంటి పరిసరాల్లో అరటి చెట్టును నాటాలనుకుంటే..తప్పకుండా వాస్తు నిపుణులను సంప్రదించి ఎక్కడ నాటాలో తెలుసుకుని మాత్రమే నాటండి. అలాగే చెట్టు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version