రేపు ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా జైనథ్‌ మండలం దీపాయిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శిస్తారు. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణంలోని బీడీఎన్‌టీ డాటా సొల్యూషన్‌ ఉద్యోగులతో మాట్లాడుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శిస్తారు. అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అవుతారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేసి, బాసర నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఇదిలా ఉంటే.. భవిష్యత్తు నగరం కోసం చేపట్టే అభివృద్ధి పనులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, ఈ మేరకు సౌకర్యాలను అభివృద్ధి చేయాలని మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

శనివారం గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో సాగుతున్న అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోకాపేటలోని నియోపోలీస్‌ లేఅవుట్‌, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీల) నిర్మాణ పనులు పరిశీలించారు. ఎస్టీపీల నిర్మాణాల్లో వినియోగించే సాంకేతికతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ప్రమాణాలకు సరిపోయే విధంగా నియోపోలీసు లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు, రోడ్డు నెట్‌వర్క్‌లు, సైకిల్‌ ట్రాక్‌ కోసం కొన్ని మార్పులను మంత్రి సూచించారు. అంతకుముందు ఫతేనగర్‌లోని ఎస్టీపీల నిర్మాణ పనులు మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ దశలో ఉన్న అన్ని ఎస్టీపీలపైన వాటర్‌బోర్డు అధికారులతో సమీక్షించారు. కాగా, కోకాపేటలోని ఎన్‌సీసీ క్యాంప్‌సలో వాటర్‌బోర్డు సేఫ్టీ ప్రొటోకాల్‌ టీమ్‌ వాహనాలను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version