ఇంట్లో వస్తువులు ఇలా ఉంటే.. మానసిక స్థితి దెబ్బతింటుంది.!

-

ఇంట్లో: ఇళ్లు బాగుంటే.. ఇంట్లో మనుషులు బాగుంటారు. ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఎక్కువైపోతే… దాని ప్రభావం పెద్దలపైనే పడుతుంది. ఇంట్లో ఉండే వస్తువుల వల్ల కూడా మానసిక ప్రశాంతం లభిస్తుంది. కొన్నిసార్లు దెబ్బతింటుంది. వస్తువులు తప్పు దిశలో ఉంటే నెగెటివ్‌గా మారవచ్చు. ఇలా వస్తువుల ప్రభావం ఇంట్లో నివసించే వారి శారీరక మానసిక పరిస్థితుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు మానసిక ఉద్రిక్తత పెరిగిపోతుంది. కొంత మంది ఇళ్లలో తెలియని అశాంతి తాండవిస్తుంటుంది. ఇందుకు కారణం కొన్ని సార్లు వాస్తు కావచ్చు. ఎలాంటి వాస్తు దోషాలు ఇందుకు కారణం కావచ్చో తెలుసుకుందాం.

 

ఈ వస్తువులు ఇంట్లో వద్దు..

ఇంట్లో భయం గొలిపే చిత్రాలు పెట్టుకోవద్దు. ఉగ్ర రూపంలో ఉండే దేవుడి బొమ్మ లేదా విగ్రహం కూడా పెట్టుకోవడం మంచిదికాదు. హింసను సూచించే ఎలాంటి చిత్రాన్ని లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకోకూడదు. వీటి వల్ల ఇంట్లో నెగెటివ్ శక్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక అశాంతి పెరిగిపోతుంది.

ఇంట్లో పెద్ద వారు ఎప్పుడూ నైరుతిలో పడుకోవాలి. పాదాలు పడమర దిశలో, ఉత్తరం వైపు తల ఉండకూడదని గుర్తుపెట్టుకోవాలి. తల ఆగ్నేయంలో ఉంటే మంచిది. నిద్రించేందుకు సరైన దిశను ఎంచుకోవాలి. లేదంటే మానసిక సమస్యలు రావచ్చు.

ఇంట్లో విరిగిపోయిన వస్తువులు పెట్టుకోవద్దు. ఇంట్లో ప్రతికూలతకు ఇవి కారణం కావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు దారితీస్తుంది. అందుకే వీలైనంత త్వరగా విరిగిన వస్తువులను ఇంట్లోనుంచి తీసేయ్యాలి.

ఇంట్లో అద్దం దక్షిణం లేదా పడమర గోడకు అమర్చకూడదు. ఈ దిక్కున ఉన్న అద్దం ప్రతికూల ప్రభావాలకు కారణం అవుతుంది. ఇంట్లో పగిలిన అద్దం ఉంటే వెంటనే తీసెయ్యాలి. ఇది మానసిక అశాంతికి కారణం కావచ్చు.

ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కూడా అభివృద్ధి నిరోధకంగా మారుతుంది. ఫలితంగా మానసిక అశాంతికి కారణం అవుతుంది.

ఎప్పుడూ పిల్లర్ కింద కూర్చుని పనిచెయ్యకూడదు. ఇది తలనొప్పి లేదా మానసిక అశాంతి కి కారణం అవుతుంది.

ఇంట్లో వాష్ రూమ్‌లు మూసి పెట్టి ఉంచాలి. తెరచి ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ చేరి అది మానసిక అనారోగ్యానికి కారణం అవుతుంది.

పూజా స్థలం వాస్తుకు అనుకూలంగా ఉండాలి. పూజ స్థలం ఇంట్లో ఈశాన్యంలో ఉండాలి. ఈశాన్యంలో లేదా తూర్పు దిశలో నీటిని నిల్వ చెయాలి. లేదా నీటి తొట్టి లేదా కలశం వంటిది ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే ఇది ఇంట్లోని మహిళల మానసిక స్థితి మీద చాలా ప్రభావం పడుతుంది.

ఇంట్లో వాడని మందులు లేదా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందులు ఉంటే వెంటనే బయట పడెయ్యాలి. ఇది చాలా పెద్ద నెగెటివ్ ఎనర్జీకి దారితీస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version