వాస్తు: పూజ గదిలో ఈ మార్పులు చేస్తే ఇక అంతా శుభమే..!

మన ఇంట్లో తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి సమస్య నుండి అయినా సరే బయటపడొచ్చు. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యల నుండి బయటపడవచ్చు.

అయితే మరి ఎటువంటి ఆలస్యం లేకుండా పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాల గురించి చూద్దాం. మన ఇంట్లో ప్రతిదీ కూడా మనం సరిగ్గా ఉంచుకోవాలి లేదు అంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పూజ గదిలో కూడా మనం తగిన శ్రద్ధ తీసుకోవాలి.

పూజ గదిలో ఎంతో ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకున్నట్టు మనం ఉంచుకోవాలి. ఎంతో ప్రశాంతకరంగా నిశ్శబ్దంగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి అలానే చెత్తాచెదారం వంటివి అక్కడ ఉండకూడదు. దీని వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది.

అదే విధంగా పూజ గదిలో వేసుకునే రంగులు కూడా చాలా ముఖ్యమైనవి అని పండితులు అంటున్నారు. వాస్తు ప్రకారం పూజ గదిలో పసుపు రంగు వేస్తే చాలా మంచిది లేదు అంటే తెలుపు రంగు కూడా మంచిదే. ఈ రంగులని పూజ గదిలో వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే ఇంట్లో అంతా సమస్యలు తొలగిపోతాయి ఇలాంటి మార్పు చేయడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. ఏ సమస్యలు ఉండవు.