ప్రపంచ వ్యాప్తంగా హిందువులు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం గురించి మాట్లాడుకుంటారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్మించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. ఈనెల 10న ఉదయం 4.30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఎనిమిది గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందని చెప్పారు.
టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనాలకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందని తెలిపారు. అన్ని ప్రత్యేక దర్శనాలకు ఈ పది రోజులు రద్దు చేసినట్టు వెల్లడించారు. సామాన్య భక్తుల కోసం సిఫారుసుల లేఖల దర్శనం రద్దు చేసినట్టు పేర్కొన్నారు. తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాలు ఇప్పటికే భక్తులతో కిక్కిరిసిపోయాయని తెలిపారు.