ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలలో కీలక మార్పులు తీసుకురానుంది. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శుక్లా ప్రకటించారు. తాము కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేసారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈనెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు నిర్వహిస్తామని తెలిపారు.
అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో NCERT సిలబస్ ను ప్రవేశ పెడుతున్నామని ఇంటర్మీయట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విద్యాశాఖ ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది.