ఈ దిశలో పక్షులను పెంచడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!

-

చాలా శాతం మంది ఇంట్లో ఎంతో అందంగా ఉంటాయని కొన్ని రకాల పక్షులను, జంతువులను పెంచుతూ ఉంటారు. వీటిని ఇష్టంతో పెంచడం మాత్రమే కాకుండా అదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి అని భావిస్తారు. ఎప్పుడైతే ఇంట్లో పక్షులు, జంతువులు వంటివి ఉంటాయో సానుకూల శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పక్షులను మరియు జంతువులను ఉంచడం వలన ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది. దీంతో అదృష్టం కూడా ఎంతో ఎక్కువగా ఉంటుంది.

ఇంట్లో పక్షులను పెంచడం వలన ఎంతో అందంగా ఉండడం మాత్రమే కాకుండా చిలకలు వంటి పక్షులు అదృష్టాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఇంట్లో రామచిలుకలను ఉత్తరం వైపు పెంచుతారో ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది అనే చెప్పవచ్చు. ప్రేమ పక్షులు వంటిని తూర్పు లేక వాయువ్యం దిశలో లేక ఈశాన్యం వైపున పెట్టవచ్చు. ఈ విధంగా పక్షులను ఇంట్లో పెట్టడం వలన ఎన్నో లాభాలను పొందవచ్చు. పక్షులు మాత్రమే కాకుండా ఇంట్లో చేపలు తొట్టెను పెట్టడం వలన కూడా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం, ఐశ్వర్యం పొందాలంటే చేపల తొట్టెను తప్పకుండా ఈశాన్యం దిశలో పెట్టాలి.

ఇలా చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తారు. ఇంట్లో దుష్ట శక్తులు వంటివి రాకుండా ఉండాలంటే కచ్చితంగా చేపల తొట్టిని ఇంట్లో పెట్టాల్సిందే. కొంతమంది తాబేలును ఎంతో ఇష్టంగా పెంచుతూ ఉంటారు. అయితే ఇంట్లో తాబేలును ఉత్తరం వైపున పెట్టడం వలన మరింత ప్రయోజనం ఉంటుంది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. హిందువులు ఆవులను ఎంతో ఎక్కువగా పూజిస్తారు. ఎప్పుడైతే ఇంట్లో గోమాతను పూజిస్తారో ఎన్నో ఇబ్బందులు తొలగిపోయి ఆనందంగా జీవించవచ్చు. ముఖ్యంగా ఆవులు వాయువ్యం లేక తూర్పు దిశలో ఉంటే ఎంతో మేలు. కనుక వాస్తు శాస్త్రం ప్రకారం ఈ పక్షులను, జంతువులను ఇంట్లో ఉంచడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news