భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-

టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తుందని.. ఈ వేసవిలో సామాన్యులకు సైతం సకాలంలో తిరుమలలోని దైవదర్శనం జరిగేందుకు వీలుగా L1 దర్శనం కూడా రద్దు చేశామని ఆయన అన్నారు. అటువంటి కూటమి ప్రభుత్వం పై భూమున కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బ తీసేవిదంగా మాట్లాడటం సరికాదని ఆయన టీటీడీ చైర్మన్ గా పని చేసే సమయంలో ఎటువంటి అవినీతి జరిగిందో.. నెయ్యిలో ఎటువంటి కల్తీ జరిగిందో చూశామని అన్నారు. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి దేవస్థానం నడుపుతుంటే.. నెయ్యిలో అవినీతి జరిపి వ్యాపారం చేసే మనిషి అసత్య ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారంటూ మంత్రి కొండపల్లి ఫైర్ అయ్యారు. మార్పు వైపు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు కూడా భూమన పై ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news