ఇంటి ముఖద్వారం వద్ద ఈ విగ్రహాన్ని పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు..!

-

ఇంట్లో ఉండే కొన్ని వస్తువులకు సానుకూల శక్తి ఉంటుంది. కనుక తప్పకుండా అటువంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలి. అయితే ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవడానికి సూర్యుడు విగ్రహం ఎంతో సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ఇంటి ముఖద్వారం దగ్గర సూర్యుడు విగ్రహాన్ని పెడతారో ఎన్నో లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటిస్తే ఎన్నో ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. కేవలం ఇంటి నిర్మాణంలో మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే ప్రతి వస్తువును వాస్తు శాస్త్రం ప్రకారం ఉంచాలి. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తారు.

 

అదే విధంగా ఇంటి ముఖద్వారం ముందు సూర్యుడు విగ్రహం పెడితే ఎన్నో లాభాలను పొందవచ్చు. ఎప్పుడైతే సూర్యనారాయణ మూర్తి విగ్రహాన్ని ముఖద్వారం ముందు పెడతారో, ధనం పెరుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. సూర్యుడు గ్రహాలకు అధిపతి. అంతేకాకుండా సానుకూల శక్తిని పెంచడానికి సూర్యుని విగ్రహం సహాయం చేస్తుంది. ఎప్పుడైతే ఇంటి ముఖద్వారం ముందు పెడతారో శని దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు. పైగా గురుదోషం, పితృ దోషం వంటివి కూడా తగ్గుతాయి.

అదేవిధంగా, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కచ్చితంగా సూర్యనారాయణ మూర్తి విగ్రహాన్ని ఇంటి ముఖద్వారం దగ్గర పెట్టడం ఎంతో అవసరం అని పండితులు చెబుతున్నారు. కనుక ఇలా చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది మరియు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో ఎంతో ఆనందంగా జీవించవచ్చు. కాకపోతే వ్యాపారం చేసేవారు మాత్రం సూర్యుడు విగ్రహాన్ని పెట్టకూడదు. ముఖ్యంగా పాత సామాన్లు, నూనె, ఇనుము వంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నవారు సూర్యుడు విగ్రహాన్ని పెట్టడం వలన ఎంతో నష్టం ఉంటుంది అని గుర్తుంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news