తమకు చాలెంజ్ గా మారిన గుజరాత్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. తాజాగా మిషన్ గుజరాత్ కింద ఏఐసీసీ పరిశీలకులను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. 43 మంది అబ్జర్వర్లను, ఏడుగురు సపోర్టింగ్ అబ్జర్వర్లను నియమించిది. వీరికి జిల్లా అధ్యక్షులను నియమించే బాధ్యతలను
అప్పగించింది. ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఒక ఏఐసీసీ పరిశీలకుడితో పాటు నలుగురు పీసీసీ పరిశీలకుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ఐఐసీసీ జనరల్ సెక్రటరీ కే.సీ వేణుగోపాల్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ ప్రకటించిన అబ్జర్వర్లలో తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (), ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చందర్ రెడ్డి, ఏపీ మాజీ పీసీసీ చీప్ గిడుగు రుద్రరాజు.
తెలంగాణ ఏఐసీసీ మాజీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కు చోటు దక్కింది.