తెలంగాణ ఇంటర్ ఫలితాలకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

-

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలెర్ట్. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు కూడా అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఈ మేరకు ముహుర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ఏపీ రాష్ట్రంలో ఇవాళ ఇంటర్ పరీక్షలు ఫలితాలు విడదలైన విషయం విధితమే. ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర అధికారులు కూడా కసరత్తులు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ నెల అంటే ఏప్రిల్ 25వ తేదీ లేదా 27వ తేదీలలో ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 05వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసి ఆన్ లైన్ లో మార్కులు ఫీడ్ కూడా చేశారు అధికారులు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి రీ వెరిఫికేషన్ కూడా పూర్తవుతుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news