సహజంగా వాస్తు చిట్కాలను పాటించడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి పెరగాలంటే, కచ్చితంగా వాస్తు నియమాలను పాటించాలి. ముఖ్యంగా జీవితంలో ఎలాంటి ఇబ్బందులను అయినా ఎదుర్కొంటే, తప్పకుండా వాస్తు శాస్త్రంలో చెప్పిన నియమాలను పాటించండి. ఇలా చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎన్నో విభేదాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు, వాస్తు నియమాలను పాటించడం వలన అటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఇంట్లో ఆనందాన్ని పెంచుకోవాలి అని అనుకుంటారో మరియు కుటుంబ సభ్యుల మధ్య శాంతి, శ్రేయస్సు పెరగాలంటే ఈ చిట్కాలను తప్పకుండా పాటించాలి అని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఎప్పుడైతే పడకగది వాతావరణం బాగుంటుందో, భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం మరింత బాగుంటుంది. ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే, తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచాలి. పెళ్లయిన దంపతులు కలిసి ఆనందంగా ఉండాలంటే, పడకగదిలో రాధాకృష్ణుల ఫోటోలు ఉంచాలి. ముఖ్యంగా ఈశాన్య దిశలో ఈ ఫోటోను ఉంచడం వలన జీవితంలో సంతోషంగా ఉంటారు మరియు రాధాకృష్ణుని విగ్రహం కూర్చున్న ఫోటో ఉంటే మరింత మంచిది అని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అదేవిధంగా వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలంటే, సహజమైన సుగంధాలను ఉపయోగించాలి లేదా అగర్బత్తులను వెలిగించడం వలన, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తలు పడుకునే గదిలో తాజా పూలను ఉంచడం వలన సానుకూల శక్తి పెరుగుతుంది. గులాబీ, మల్లె వంటి పూలు సానుకూల శక్తిని ఇవ్వడంతో పాటుగా ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. కనుక ఇటువంటి పువ్వులను తప్పకుండా ఉంచాలి. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గాలంటే, ఏడు గుర్రాల ఫోటోను మీరు పడుకునే ప్రదేశంలో ఉంచాలి. దీని వలన సానుకూల శక్తి పెరుగుతుంది మరియు ప్రేమ, అనురాగాలు మరింత ఎక్కువ అవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోను తూర్పు వైపు ఉంచడం వలన మరింత ఉపయోగం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.