ఏదైనా సమస్యను తొలగించాలంటే వాస్తుని అనుసరిస్తే ఆ సమస్య నుండి బయట పడవచ్చు అని వాస్తు నిపుణులు అంటున్నారు. చాలా మంది ఇళ్లల్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య నుండి బయట పడాలంటే చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు సమస్యల నుండి బయట పడాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి…?, ఎలాంటి తప్పులు చెయ్యకూడదు అనేది చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి చూసేద్దాం.
మొక్కలు మరియు చెట్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకనే ఎక్కువగా మొక్కలు తినటం మంచిది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా మొక్కలు నాటడం మంచిదే. కానీ కొన్ని రకాల మొక్కల వల్ల సమస్యలు వస్తాయని పండితులు చెప్పారు. ముఖ్యంగా రావి చెట్టు ఇంట్లో ఉండటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
ఇంట్లో రావి చెట్టు ఉండడం అసలు మంచిది కాదని అందుకనే ఇంట్లో రావి చెట్టును ఉంచకూడదని అన్నారు. ఒకవేళ కనుక మీ ఇంట్లో రావి చెట్టు ఉంటే జాగ్రత్తగా దానిని మరొకచోట నాటడం మంచిది. ఇంట్లో రావి చెట్టు ఉండడం వల్ల కుటుంబం మధ్య కలహాలు ఎక్కువగా వస్తాయని తరచూ కుటుంబమంతా బాధపడాల్సి వస్తుంది అని పండితులు అంటున్నారు. అందుకని ఇంట్లో రావి చెట్టుని ఒకవేళ ఉంటే జాగ్రత్తగా వేర్లతో దాన్ని తీసుకెళ్లి మరొకచోట నాటడం మంచిది.