వాస్తు: ఆర్ధిక సమస్యలని నుండి ఇలా బయట పడండి…!

ప్రతి ఒక్కరూ వాస్తుని తప్పక అనుసరించాలి. వాస్తు వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా ఇంట్లో ఉండే సమస్యలన్నీ తగ్గిపోతాయి. అయితే ఈ రోజు కొన్ని వాస్తు చిట్కాలని మనం చూద్దాం. వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి జరుగుతుంది.

vasthu1

 

ఎప్పుడూ కూడా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడే ఇంటికి మంచి కలుగుతుంది. అదే విధంగా పూజ గది లో డబ్బులని ఎప్పుడూ పెట్టకూడదు. దేవుడి దగ్గర డబ్బులు పెట్టడం వల్ల దేవుడి కంటే డబ్బు పై దృష్టి ఎక్కువ వెళుతుంది. కాబట్టి అలా పెట్టకండి.

అదే విధంగా పూజ గదిలో లక్ష్మీ దేవి చిత్రపటం తప్పక ఉంచండి. అలానే వీలైతే లక్ష్మీ దేవికి రెండువైపులా ఏనుగులను పెట్టండి. అలానే ఇంటి ప్రధాన ద్వారాలు కూడా ఎప్పుడూ సరిగ్గా ఉంచుకోవాలి. ద్వారాలు పాడైపోయినా లేదు అంటే సగం తెరిచి వున్నా అది మంచిది కాదు. దీని వల్ల అధిక నష్టం కలుగుతుంది.

అలానే రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత ఆ సామాన్లని వెంటనే కడిగేసుకోవాలి. వాటిని ఉదయం వరకు ఉంచితే మంచి కలగదు. కనుక ప్రతి ఒక్కరు ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిది. దీంతో సమస్యలు కూడా ఉండవు. కాబట్టి ఈ విధంగా అనుసరించి ఆనందంగా ఉండండి.