“బో **డికే అన్నది సజ్జలను…జగన్ ను కాదు : అయన్నపాత్రుడు క్లారిటీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ని తిట్టడం పై తెలుగు దేశం పార్టీ కీలక నేత మరియు మాజీ మంత్రి అయన్నపాత్రుడు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ పద కోశం లో బో*డికే అంటే ‘పాడై పోయిన’ అనే అర్థముందని పేర్కొన్నారు మాజీ మంత్రి అయన్నపాత్రుడు.

సానుభూతి కోసం ఎంతకైనా దిగజారే సిఎం జగన్ మోహన్ రెడ్డి … సలహాల సజ్జలను బో*డికె అంటే.. అది తననే అన్నారని అన్వయించుకుని, బో*డీకే పదానికి పెడార్ధాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్ కార్డ్ బయటకి తీసాడని సిఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి అయన్నపాత్రుడు.

తల్లి పై నిజంగా ప్రేమ ఉంటే, తల్లిని బూతులు తిట్టిన వారికి మంత్రి పదవులు ఇవ్వడని చురకలు అంటించారు. తల్లిని, చెల్లిని అలా తెలంగాణ రోడ్ల పై అనాథలుగా వదిలేయడని మండిపడ్డారు. సింపతీ వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం సిఎం జగన్ అంటూ ఫైర్ అయ్యారు.
ఓట్లు, సీట్లు వస్తాయని తండ్రి, బాబాయ్ శవాల దగ్గర నుండి కోడి కత్తి వరకూ దేనిని వదలని జగన్ బో*డికె పదాన్ని వదులుతాడా ? అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అయన్నపాత్రుడు.