వాస్తు: ఈ తప్పుల్ని చేస్తే ఇంట్లో సమస్యలు తప్పవు..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఏ ఇబ్బందీ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అవుతుంది. అలాగే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ రోజు మనతో పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవడం జరిగింది. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

 

అయితే మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి చూద్దాం. వీటిని కనుక ఫాలో అయితే ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. అలానే ఆనందంగా ఉండడానికి అవుతుంది. చాలామంది కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పులు వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ తప్పులు లేకుండా చూసుకోవాలి.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం:

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు శుభ్రంగా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇల్లు శుభ్రంగా లేకపోతే లక్ష్మీ దేవి కూడా మీ ఇంట్లోకి రాదు. దీని కారణంగా ఇబ్బందులు వస్తాయి అని గ్రహించాలి కాబట్టి ఎప్పుడూ మీ ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవాలి. అదే విధంగా సాయంత్రం పూట ఇల్లు చదవకూడదు. ఇలా ఈ తప్పు చేయడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.

విరిగిపోయిన ఫర్నిచర్:

ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన ఫర్నిచర్ ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిపోయిన సామాన్లు వల్ల వాస్తు దోషాలు కలుగుతాయి. కాబట్టి అలాంటి ఫర్నిచర్ ని ఇంట్లో ఉంచకండి.

పావురం గూడు:

ఇంట్లో పావురాలు గూడు పెట్టి ఉంటే కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పావురం గూడు ఇంట్లో ఉంటే తొలగించడం మంచిది.

గడియారం:

పనికిరాని గడియారాలు ఇంట్లో ఉంచుకోకూడదు. పనికిరాని గడియారం, విరిగిపోయిన గడియారం వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ తప్పులు చేయొద్దు వీటి వల్ల ఇబ్బందులు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news