వాస్తు: ఇంటి ముఖద్వారం దగ్గర ఈ విధంగా పాటించండి..!

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. ఇంట్లో ఇబ్బంది ఉన్నా సరే వాస్తు మనకు సహాయం చేస్తుంది. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని పంచుకున్నారు. వీటిని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. వాస్తు ప్రకారం ముఖద్వారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

 

ఎందుకంటే ముఖద్వారం దగ్గర నుంచి ధన లక్ష్మి వస్తుంది. ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి వాస్తు దోషాలు ఏమీ కలగకుండా జాగ్రత్తగా అనుసరిస్తే మంచిది. మీ ఇంటి ఎదురుగ చెట్టు కానీ లేదా ఏదైనా పోల్ కానీ ఉంటే దాని వల్ల అస్సలు మంచిది కాదు. దీనివల్ల మానసిక సమస్యలు మీ కుటుంబంలో కలుగుతాయి.

అదే విధంగా ఇంటి ముందు గొయ్యి ఉండటం కూడా మంచిది కాదు. ఇది కూడా ఇబ్బందులకు దారితీస్తుంది. ఒకవేళ కనుక ఇంటి ముందు గొయ్యి ఉంటే దానిని ఈ పూడ్చేయడం మంచిది. అయితే చాలా మంది ఇంటి ఎదురుగా మొక్కలని, చెట్లని నాటుతూ ఉంటారు.

దీని వల్ల ఇంటికి మంచిది కాదు అని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనికి బదులుగా ఇంటి ముఖ ద్వారానికి ఎర్రటి గుడ్డ కట్టండి. ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది.