Vasthu : గుమ్మంలో ఈ మార్పు చేయండి.. అప్పుల నుండి బయటపడొచ్చు..!

-

ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా ఉండాలంటే వాస్తు ప్రకారం పాటించడం మంచిది. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన అనేక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు. జ్యోతిష్యం ఎలాగో
ఫెంగ్ షుయ్ కూడా చాలా ముఖ్యమైనది. ఫెంగ్ షుయ్ కి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దీనిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ నాణేలు మన జీవితంలో కూడా పెద్ద మార్పు కి దారి తీయొచ్చు. ఫెంగ్ షుయ్ నాణేలను సరైన మార్గంలో ఉపయోగిస్తే సమస్యల నుంచి బయటపడుచు. మన జీవితాల్లో మ్యాజిక్ చేసే శక్తి ఇందులో ఉంది. ఈ నాణేలను ఎలా ఉపయోగించాలి..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది చూద్దాం.

ఈ నాణేలను ఇంటికి తెచ్చుకుంటే సంతోషం ఐశ్వర్యం కలుగుతాయి. ఇవి దుష్టశక్తులను కూడా తొలగించడానికి సహాయపడతాయి. అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిని ఇంటికి తెచ్చిన తర్వాత నచ్చిన చోట ఉంచకూడదు. మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మాత్రమే వేలాడ తీయాలి. ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అప్పుల సమస్య నుంచి బయటపడవచ్చు.

వీటిని ఇంటి గుమ్మం ముందు వేలాడ తీయడం చాలా ముఖ్యం. తలుపు దగ్గర లేదా ఆగ్నేయ దిశలో వేలాడ తీయవచ్చు. వేలాడ తీసేటప్పుడు ఎరుపు రంగు దారాన్ని మాత్రమే ఉపయోగించాలి. అలాగే దీనిని జేబులో కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు అదృష్టం, సంపద వస్తాయి. పర్సులో పెట్టుకుంటే కెరియర్ లో చాలా మార్పు వస్తుంది. అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news