ఏపీలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరుకు గండ్లు పడిన విషయం తెలిసిందే. మూడు గండ్లను పూడ్చివేశారు. తాజాగా పూడ్చివేసిన గండ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడమేరుకు ప్రస్తుతం వచ్చిన వరద గతంలో ఎన్నడూ రాలేదు. బుడమేరుకు వచ్చిన వరద విజయవాడ ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేసింది. పులివాగు నీరంతా శాంతి నగర్ ద్వారా నగరంలోకి వచ్చింది. ఆర్మీ కూడా ఈ గండ్లను పూడ్చలేక పోయింది.
బుడమేరు గండ్లను పూడ్చకుంటే నగరంలోకి వరద నీరు వస్తూనే ఉంటుంది. ఇలాంటి సంక్లిష్టమైన గండ్లను మంత్రి నిమ్మల నేతృత్వంలో పూడ్చారు. కష్టతరమైన గండ్లను పూడ్చిన నిమ్మల, ఇరిగేషన్ అధికారులకు అభినందనలు తెలిపారు సీఎం చంద్రబాబు. బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో గత ప్రభుత్వంలో కబ్జాకు గురైంది. దుర్మార్గుడైన నేత ఐదేళ్లు పాలించాడు. అభివృద్ధి చేయకున్నా ఫర్వాలేదు.. కానీ గత పాలకులు వ్యవస్థలను భ్రష్టు పట్టించేలా చేశారు. అధికారులతో పని చేయించడానికి నాకు చాలా కష్టతరమైంది. సీపేజీని అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీపేజీని అరికట్టేందుకు రబ్బర్ షీట్ల వేయడం కోసం గజ ఈతగాళ్లను రప్పించాం.ఇప్పటికీ కొంత సీపేజీ ఉంది. కరకట్టను వెడల్పు చేస్తున్నామని తెలిపారు.