పార్టీ పిరాయింపులపై తెలంగాణ స్పీకర్ సంచలన ప్రకటన !

-

తెలంగాణలో కొంత మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించిన వారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హై కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఇటీవలే తీర్పు వెల్లడిస్తూ.. అసెంబ్లీ సెక్రెటరీకి ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో బీఆర్ఎస్ నేతలు వారి ఎమ్మెల్యే పదవీ పోతుందని.. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా పార్టీ పిరాయింపులపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. ఈ అంశం  కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఎలాంటి  కామెంట్స్ చేయలేనని చెప్పారు. త్వరలో పార్టీ పిరాయింపుల పై నిర్ణయం తీసుకుంటాం..హై కోర్టు అసెంబ్లీ సెక్రెటరీ కి నాలుగు వారాల్లోపు అసెంబ్లీ ప్రోసీడింగ్స్ ప్రకారం రిపోర్ట్ సబ్మిట్ చెయ్యాలని చెప్పింది. అనర్హత, ఉప ఎన్నిక పై రాబోయే కాలంలో నిర్ణయం అందరికీ తెలుస్తుందని వెల్లడించారు స్పీకర్ గడ్డం ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news