గణేష్ నవరాత్రి 5వ రోజు – వినాయ‌క మ‌హ‌త్యం – మహోదర వినాయకుడు..

-

నైవేద్యం – కొబ్బరి కురిడీ

మహా గణపతిని జయించేందుకు మూషికాసురుడు అనేక ఉపాయాలు పన్నుతూనే ఉన్నాడు. ఈసారి శుక్రాచార్యుని ప్రియశిష్యుడైన మోహాసురుని గణపతిపై దాడికి ఎంచుకున్నాడు. రాక్షస గురువు దగ్గర సూర్యోపాసన నేర్చుకున్న మోహాసురుడు మహాశక్తి మంతునిగా మారాడు. మధిర అనే రాక్షస కన్యను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత లోకంపై దండెత్తి, ప్రజలను మోహ ప్రభావానికి గురిచేశాడు. దీంతో లోకంధ ర్మానికి దూరమైంది. అప్పుడు, మూషికాసురుడు మోహానురుడితో ఇలా అన్నాడు. ఓ మోహానురా! లోకమంతా నీ మోహ ప్రభావంలో పడింది.

LORD GANESH

గణపతి మన చెరలో నున్న ఒక గంధర్వ వనితను విడిపించి ఘనకార్యం సాధించినట్లు భావిస్తున్నాడు. నీవు గంధర్వలోకానికి వెళ్లు. ఎలాంటివారైనా మోహానికి గురికాక తప్పదు. నీ సమ్మోహన శక్తిని గంధర్వకాంతలపై ప్రయోగించు. భార్యలు భర్తల ఎడ, కన్యలు తల్లిదండ్రుల ఎడ అణుకువ లేక మోహంతో పతనమయ్యే మార్గం చూడు..! అన్నాడు. మోహానురుడు అలాగే చేశాడు. దీంతో సమస్త జనులూ మోహంలో పడి కొట్టుకుంటున్నారు. చిన్నా పెద్దా, వావివరసలూ, ధర్మం అధర్మం ఏవీ లేవు. చివరకు మహాగణపతే స్వయంగా పౌరోహిత్యం వహించి పెండ్లి చేసిన జయంతుని పల్ని చిత్రాంగి కూడా భర్తను వీడి మోహ రాక్షసుని వెంటపడింది.

ఈ వైపరీత్యంతో తల్లడిల్లిన గంధర్వరాజు చిత్రాంగదుడు, దేవతలు, మునులతో కలిసి ప్రవాళ క్షేత్రానికి వెళ్లి అక్కడి ప్రవాళ గణపతిని విశేషంగా పూజించారు. అందుకు సంతోషించిన గణపతి మోహాసుర మాయను మాయతోనే అంతం చేస్తానని వారికి మాట ఇచ్చాడు. గంధర్వనగరానికి చేరి మోహమాయలో పడ్డ స్త్రీలు, మోహరాక్షసుడి మధ్యలో నిలబడ్డాడు. అంతా ఆ గణపతి మాయ చూసి విస్తుపోతుండగానే, ఆగండి, సమస్త లోకాలను మోహింపచేసే నన్ను కాకుండా ఆ రాక్షసుని అనుసరిస్తారెందుకు? అని ప్రశ్నించగానే .. ఆ పలుకే వారిపై మహామంత్రమై పనిచేసి బాధితులంతా స్వస్థత చెందారు.

మహా గణపతికి చేతులెత్తి మొక్కారు. అంతలోనే మోహానురుడు కోపంతో…ఎవడురా నీవు? నా మాయనే తిరస్కరిస్తావా..? అంటూ గర్జించాడు. అప్పుడు గణపతి ఇలా అన్నాడు. ఓ మోహాధమా! నేను నిన్ను మించిన మహామాయను. నా మోహం చేతనే ఈ జగత్తు కల్పింపబడింది. ఇదిగో నా నిజం రూపం చూడు అంటూ భూమి ఆకాశాల మధ్య మహోదర గణపతి రూపంలో నిలిచాడు. అండపిండ బ్రహ్మాండాలు ఆ మహిూదరుని ఉదరంలోనే ఉన్నాయి. దీంతో మోహాసురుని మోహం తొలగి గణేశుని శరణు వేడాడు. దీంతో స్వామి  దివ్యాస్త్రాన్ని ఒకదానిని ప్రయోగించి మోహాన్ని అంతం చేశాడు. మోహాసురుని దేహం నుండి ఒక జ్యోతి వెలువడి మహెదర గణపతిలో చేరింది. గంధర్వులంతా జయజయ ధ్వానాలు చేశారు. అంతా మహిూదర గణపతిని పూజించి మోహభ్రాంతిని వదిలి సజ్జనులుగా జీవించాలని చిత్రాంగదుడు అందరికీ బోధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news