వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాలు భక్తుల హృదయాలను ఆకర్షిస్తాయి. నాటి సాంప్రదాయక మట్టి విగ్రహాల నుంచి నేటి ఆధునిక థీమ్ ఆధారిత డిజైన్స్ వరకు గణపతి విగ్రహాలు ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మట్టి గణపతిని మాత్రమే పూజించేవారు. ఆ తర్వాత ప్లాస్టర్ పారిస్ ఇప్పుడు సినిమా ట్రెండుల్లో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆధునీకత మధ్య పోలికలను విగ్రహాల రూపకల్పనలో కాలానుగుణ మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం..

సాంప్రదాయక గణపతి విగ్రహాలు : పూర్వం గణపతి విగ్రహాలు సాధారణంగా మట్టితో తయారు చేసేవారు. సహజమైన రంగులు సాంప్రదాయ ఆభరణాలతో అలంకరించేవారు. ఈ విగ్రహాలు భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు గా ఉండేవి. గ్రామీణ ప్రాంతాల్లో చేతితో తయారు చేసిన విగ్రహాలు గణేశుని సాంప్రదాయ రూపాన్ని ప్రతిబింబించేవి. ఈ విగ్రహాలు సరళమైన డిజైన్లతో ఆధ్యాత్మిక వాతావరణంలో సృష్టించేవి. ఇవి ఎవరికి వారు ఇంట్లో తయారు చేసుకునేవారు.
ఆధునిక ట్రెండ్లు : నేటి గణపతి విగ్రహాలు ఆధునికతను ఆలింగణం చేస్తున్నాయి. థీమ్ ఆధారిత విగ్రహాలు, సినిమా హీరోలు, సూపర్ హీరోలు, రాజకీయ నాయకుల రూపాల్లో గణేశుడు దర్శనమిస్తున్నాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఫైబర్ వంటి పదార్థాలు వాడకం పెరిగిపోయింది. ఎల్ఈడి లైట్లు, రంగురంగుల డెకరేషన్లతో విగ్రహాలు ఆకర్షణీయంగా మారాయి. పెద్ద పెద్ద పందిళ్లలో భారీ విగ్రహాలు, భారీ ఎత్తున యువతను ఆకర్షిస్తున్నాయి
పర్యావరణ ప్రభావం: సాంప్రదాయక మట్టి విగ్రహాలు నీటిలో కరిగి పర్యావరణాన్ని హాని చేయవు. కానీ అధునాతన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నీటిని కలుషితం చేస్తాయి. ఈ సమస్యను గుర్తించి ఇటీవల కొందరు మట్టి విగ్రహాల వైపు ఆసక్తి చూపారు. కొందరు గణపతి విగ్రహాలు మట్టితోనే ఉండాలనేటువంటి నినాదం తో ఉద్యమాలను కూడా చేస్తున్నారు.
ఈ ట్రెండ్ సాంప్రదాయ భక్తిని, అధునాతన ఆకర్షణలను అందిస్తున్నాయి. రెండింటిని సమతుల్యం చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ గణేశుని ఉత్సవాలు జరుపుకోవడం ఆదర్శం .సాంప్రదాయ మట్టి విగ్రహాలు ఆధునిక డిజైన్లతో కలపడం ఒక మంచి పరిష్కారం అవుతుంది.
గణపతి విగ్రహాల్లో మార్పు కాలానుగుణంగా మారటం సహజం. సాంప్రదాయం, ఆధునికత రెండు భక్తిని ఒకేలా పెంచుతాయి. పర్యావరణ స్పృహతో వినాయకుడి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకుందాం..