64 ఏళ్ళ కృషితో…264 కోట్ల భారీ బంగారు గణేష్ విగ్రహం..! వీడియో

752

వినాయక చవితి వచ్చిందంటే చాలు ఎవరికి వారు ప్రాంతాల వారీగా, భారీ స్థాయిలో విగ్రహాలని ఏర్పాటు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఈ కోవలోనే తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడు ప్రసిద్ది చెందాడు. అయితే తాజాగా ఇండియా వ్యాప్తంగా ముంబై లో గణేష్ పేరు మారుమోగి పోతోంది. సహజంగానే ముంబై లో గణేష్ మహారాజ్ కి బ్రహ్మరధం పడుతారు ముంబై ప్రజలు మరి అలాంటిది గణేష్ నవరాత్రులు అంటే మారు మొగి పోవాల్సిందే. భారీ సైజులో విగ్రహాలు ముంబై వీధుల్లో అలరిస్తాయి. అంతేకాదు ముంబైలో ఏర్పాటు చేసే భారీ విగ్రాహాలకి ఇన్స్యూరెన్స్ కూడా చేయిస్తారు.

ఈ ఏడాది గణేష్ నవరాత్రులు పురస్కరించుకుని ఎప్పటిలాగానే ముంబై లో గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్ గణేష్ మండల్ అనే సేవా మండలి, తాము నెలకొల్పిన భారీ వినాయకుడికి రూ 264 .75 కోట్లతో ఇన్స్యూరెన్స్ చేయించింది. ఈ సంఘం ముంబైలోనే అత్యంత ఖరీదైన సంఘంగా పేరొందింది. అయితే ఇంత భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించడానికి గల కారణం ఏమిటంటే. ఈ విగ్రహన్ని 70 కీజీల బంగారం, 350 కేజీల వెండితో తయారు చేశారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఎలా సాధ్యమయ్యిందంటే..

దాదాపు 64 ఏళ్ళుగా ఈ విగ్రహం ఏర్పాటు కోసం బంగారం, వెండి విరాళాలుగా ఇస్తున్నారట భక్తులు. మరి ఇంత భారీ మొత్తంలో దాదాపు 264 కోట్లు పలికే వినాయక విగ్రహానికి భద్రతా ఎలా అనుకుంటున్నారా అందుకోసం భారీ యంత్రాంగాన్నే నియమించుకున్నారు. విగ్రహం చుట్టుపక్కల సుమారు 65 సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారట.

ఈ కెమెరాలు నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయించారట. విగ్రం భద్రతా కోసం సుమారు 500 వందల మందిని నియమించారట. చుట్టూ డ్రోన్ కెమెరాలతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో గణేష్ కొలువు తీరాడు. ఈ విగ్రహాన్ని చూడటానికి భక్తులు తండోప తండాలుగా వస్తున్నారట. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే. ఇక్కడికి వచ్చే భక్తులకి కూడా 20 కోట్ల భీమా కూడా ఉంటుందట.