హిందూ శాస్రం లో గణపతి 32 రూపాల్లో ముఖ్యమైనవి 16. అందులో రెండవది భక్త గణపతి రూపం. భక్తులకు ప్రియమైన ఈ రూపం పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తూ పూలమాలతో అలంకరించబడి ఉంటుంది. నాలుగు భుజాలతో భక్త గణపతి రూపం ప్రకాశిస్తుంది. కొబ్బరి, మామిడి, అరటి, బెల్లం పాయసం, ధరించి భక్తులను ఆశీర్వదిస్తాడు. జలతత్వాన్ని సూచించే ఈ దేవుడు మనసుని శాంతపరిచి ఆనందం కలిగిస్తాడు. ఆధ్యాత్మిక భక్తి మార్గంలో ఈ రూపం అడ్డంకులను తొలగిస్తుంది. భక్త గణపతి ఆరాధన దైవిక అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది..ఈ రూపం విశిష్టతలు తెలుసుకుందాం ..
హిందూ ధర్మంలో గణపతి రూపాలు జీవితంలో వివిధ అంశాలను సూచిస్తాయి. బాలగణపతి తర్వాత రెండవ రూపమైన భక్త గణపతి భక్తి మార్గానికి ప్రతీక. ఈ రూపం పండగ కాలంలో పూర్ణచంద్రుల మెరిసిపోతూ పూలమాల ధరించి భక్తుల హృదయాలను ఆకర్షిస్తుంది. నాలుగు చేతుల్లో ధరించిన కొబ్బరి పవిత్రతకు, మామిడి మధురానికి, అరటి సమృద్ధికి, బెల్లం పాయసం ఆనందానికి, ప్రతికలుగా చెప్తారు. వీటిని ధరించి భక్తుల కోరికలను గణపతి తీరుస్తాడు. ఈ స్వరూపం జలతత్వానికి ప్రతిబింబిస్తుంది. అంటే మనసును శాంత పరిచి భాగోద్వేగాలను నియంత్రిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.ఈ రూపంలో గణపతి ప్రశాంతమైన, తేజోవంతమైన రూపంలో దర్శనమిస్తాడు.

భక్త గణపతి ఆరాధన భక్తులకు ఒక ప్రత్యేక అనుభూతి ఇస్తుంది. ఈ దేవుడు మృదస్వభావి భక్తులను రక్షిస్తాడు. కోపాన్ని అదుపు చేసి మనశ్శాంతిని కలిగిస్తాడు.ఆధ్యాత్మికంగా ఈ రూపం దైవక భక్తిని పెంచుతుంది. భక్తులు తమను తాము దేవునికి సమర్పించుకొని జీవిత అడ్డంకులను దాటుతారు. గణపతి మహిమలు శివపార్వతుల కుమారుడిగా, జ్ఞానానికి ప్రతీకగా ఉంటాయి. కానీ భక్త గణపతి భక్తి భావాన్ని మరింత గాఢంగా భక్తులకు అందిస్తాడు.ఆయనను పూజించడం ద్వారా భక్తులు తమ మనస్సులోని సందేహాలు, భయాలను తొలగించుకొని, జ్ఞాన మార్గంలో నడవగలరు గణపతి నవరాత్రుల సమయంలో ఈ రూపాన్ని స్మరించుకుంటే దైవిక అనుగ్రహం లభిస్తుంది. భక్తి మార్గంలో నడిచి గణపతి అనుగ్రహాన్ని పొందుదాం..