ఆసక్తిరేపుతోన్న తాంత్రిక ఆలయం.. రాత్రిల్లు అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే వణకడం ఖాయం?

-

చౌసత్ యోగిని అనే ఆలయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని మితావాలి గ్రామంలో ఈ టెంపుల్ ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇది రహస్యమైన ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ రహస్య ఆలయం తంత్ర సాధన, యోగిని ఆరాధనకు కేంద్రంగా పరిగణించబడుతుంది.ఈ ఆలయం తంత్ర మంత్ర జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది.ఒకప్పుడు ఇక్కడ భక్తులు తంత్ర విద్య కోసం ధ్యానం చేసేవారట. అంతేకాదు యోగిని ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందేవారట. తంత్ర సాధనలో ఈ ఆలయానికి ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాన్ని తాంత్రిక విశ్వవిద్యాలయం అని అంటారు. పూర్వం తంత్ర-మంత్రాలు నేర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చేవారట.

 

ఈ ఆలయం క్రీ.శ. 1323లో నిర్మించబడిందని.. ఈ ఆలయాన్ని రాజపుత్ర రాజులు నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయంలో మొత్తం 64 గదులు ఉన్నాయి. ఈ 64 గదులలో 64 శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయం వృత్తాకారంలో ఉంటుంది.. ఆలయం మధ్యలో బహిరంగ మంటపం కూడా ఉంది. ఇక ఈ మంటపంలో శివలింగాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ మంటపం చుట్టూ 64 గదులు ఉంటాయి. ఇక్కడ ప్రతి గదిలో శివలింగంతో పాటు యోగిని విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. అంటే ఇక్కడ 64 శివలింగాలతో పాటు 64 యోగిని విగ్రహాలు ఉంటాయి.అయితే వీటిలో కొన్ని విగ్రహాలు ఇప్పుడు చోరీకి గురయ్యాయి. తంత్ర సాధన కోసం ఈ 64 మంది యోగినిల విగ్రహాలు ముఖ్యమైనవని నమ్ముతారు.ఈ ఆలయంలో ఒక ప్రత్యేక రకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందట. ఈ శక్తి సాధకులకు ధ్యానం, సాధనలో సహాయపడుతుందట.

ఇక్కడి స్థానిక ప్రజల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఆలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడి ఉంది. రాత్రి సమయంలో ఈ ఆలయంలో లేదా సమీపంలో ఉండటానికి ఎలాంటి అనుమతి లేదు. ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమించి ఈ ఆలయం వద్ద సాయంత్రం తర్వాత ఉంటే వారు చనిపోవడం ఖాయమట. ఎందుకంటే ఈ ఆలయంలో శివుని యోగినిలు రాత్రి సమయంలో మేల్కొంటారని నమ్మకం.

ఈ గుడిలో ప్రత్యేక తాంత్రిక విద్యలను అభ్యసించే సమయంలో మంత్రాల పఠనం, యంత్రాల స్థాపన, హవనం నిర్వహించేవారు. యోగినిలను ప్రత్యేక మంత్రాలతో పూజించడం వల్ల భక్తులు అద్భుతమైన శక్తులను పొందేవారని చెబుతారు.ఇక హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం కాళీ మాతకు సంబంధించినది. ఇక్కడ స్థాపించబడిన చౌసత్ యోగిని కాళీకా దేవి అవతారమట. పురాణ మత గ్రంథాల ప్రకారం ఘోర అనే రాక్షసుడిని చంపడానికి కాళికా దేవి యోగిని అవతారం దాల్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news