తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ కామారెడ్డి అలాగే నిజామాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు జిల్లాలకు… రెడ్ అలర్ట్ జారీ చేశారు. మెదక్ అలాగే ఉమ్మడి అదిలాబాద్ అటు కరీంనగర్ జిల్లాలలో అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ మూడు జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలలో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇవాళ కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సులు ఉన్నాయి. ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ.