గణేష్ చతుర్థి వచ్చినప్పుడు గణపతి బప్పా మోరియా అని అంటాము. అయితే అసలు మోరియా అంటే ఏంటి..? ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవాడు మహారాష్ట్రలోని పోనికి 21 కిలోమీటర్ల దూరంలో చించివాడ్ అనే గ్రామంలో ఉండేవాడు. ఆయన గణపతికి భక్తుడు గణపతిని పూజించడానికి చించివాడ్ నుంచి మోరేగావ్ దాకా రోజూ కాలినడకన వచ్చేవాడు. ఓ రోజు మోరియా నిద్రపోతున్నప్పుడు గణేషుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దానిని ప్రతిష్టించమని చెప్తాడట.
అది నిజమో కాదో తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్తాడు. కలలో గణపతి చెప్పినట్లు మోరియాకు గణపతి విగ్రహం కనబడుతుంది. మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే వినాయకుడు కలలో కనిపించడం, చెప్పింది జరగడం జరుగుతుంది..? అప్పటి నుంచి ఆయన పాదాలను తాకి మోరియా అనడం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళ మూర్తి అంటూ మొక్కారు. నది నుంచి తెచ్చిన గణపతి ప్రతిమను మోరియా తెచ్చి గుడిని నిర్మించాడు.
మోరియా ఒక భక్తుడయ్యాడు కనుక అప్పటినుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు భాగం అయిపోయింది. అప్పటినుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా వినపడుతోంది. వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు అందుకని నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా అని చెప్తారు గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదులు దొరికింది కనుక ఈ నినాదాలు చేస్తారు. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారా నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా జీవిత కథ నిదర్శనం.