రెండు రోజుల్లో సీఎం పదవీకి రాజీనామా చేస్తాను. నేను నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే ఓట్లు వేయండి. నా భవిష్యత్ ను ఓటర్లే నిర్ణయిస్తారు. నేను అగ్నీ పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించండి. రానున్న ఎన్నికల వరకు నా స్థానంలో మరొకరు సీఎంగా వ్యవహరిస్తారు. ఫైల్స్ పై సంతకాలు చేయకూడదని సుప్రీంకోర్టు నిర్ణయించడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు ఐదున్నర నెలలు జైలులో ఉన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేసే సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కండీషన్లు పెట్టడంతో కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని.. తాను అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. తనపై ప్రజలకు నమ్మకం ఉంటేనే ఓట్లు వేయండి అని సూచించారు.