( 2020 – జూలై 16 నుంచి దక్షిణాయనం ప్రారంభం )
సనాతన ధర్మంలో అంటే మతం కాదు. ఇది ఒక శాస్త్రీయమైన జీవినవిధానం. దీనిలో మన పూర్వీకులు అనేకానేక శాస్త్రీయ అంశాలను జోడించి నిత్యనూతనంగా మనకు అందించారు. నేటికి అవి ఆచరనీయాంశాలే కావడం గమనార్హం. జూలై 16 నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఈ విశేషాలు తెలుసుకుందాం…
భారతీయ ధర్మం సంవత్సర కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది. అవి దక్షిణాయనం. ఉత్త్తరాయణం, దక్షిణాయనాన్ని దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు. ఉత్తరాయణాన్ని దేవతలకు పగటి సమయంగా భావిస్తారు. దక్షిణాయనం దేవతలకు రాత్రి అవడం వల్ల ఆ సమయంలో వారు నిద్రిస్తారని చెప్తారు. అందుకే విష్ణుమూర్త్తి కూడా శయన ఏకాదశి రోజు నుంచి నిద్రపోతాడని చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యడు ఈ రోజున కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజును కర్కాటక సంక్రాంతిగా పిలుస్తారు.
సూర్యగమనంలో మార్పు
దక్షిణాయనంలో సూర్యుడు దక్షిణార్థ గోళం దిశగా పయనిస్తాడు. ఇందుకు భిన్నంగా ఉత్తరాయణంలో సూర్యుడు ఉత్తరార్థ గోళం దిశగా పయనిస్తాడు. దక్షిణాయనం ఇప్పుడు (జూలై మధ్య కాలంలో) ప్రారంభవమై జనవరి 14 (సంక్రాంతి) వరకూ కొనసాగుతుంది. ఉత్తరాయణం దేవతలకు ప్రాతినిధ్యం వహించేది కాగా, దక్షిణాయనం పితృదేవతలకు ప్రాతినిధ్యం వహించే కాలంగా పరిగణిస్తారు. ముఖ్యంగా దక్షిణాయనంలోనె పితృ దేవతలు తమ సంతానం ఇచ్చే విశేష శ్రాద్ధాలు, విశేష తర్పణాలు తీసుకునేం దుకు భూమి పైకి వస్తారని చెబుతారు. ఈ దక్షిణాయనంతోనే పితృదేవతల ఆరాధనకు సంబంధించిన మహళయ పక్షాలు బాద్రపదమాసంలో వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అను గ్రహంతో సంతానాభివృద్ధి వంటివి జరుగుతాయి. సూర్యగమనాన్ని బట్టి కాలాన్ని ఈ విధంగా విభజించారని చెప్పేవారూ ఉన్నారు. నిజానికి దీక్షలు, పండుగలు వంటివి ఉత్తరాయణంలో కంటె దక్షిణాయనంలో ఎక్కువ.
– శ్రీ