మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా..? అయితే ఇలా చెయ్యండి..!

Join Our COmmunity

సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవడం లేదని ఎంతో మంది చింతిస్తారు. అయితే ఇక నుండి ఏ చింతా వద్దు. మీరు సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవడానికి ఒక ఉపాయాన్ని చెబుతున్నారు పండితులు. అయితే మరి అదేమిటో చూసి అనుసరించండి. లక్ష్మి దేవి మీ ఇంట్లోనే ఉంటుంది. మరి ఆ ఉపాయం లోకి వెళ్తే… ధనం వస్తూ వుంటుంది. ఖర్చు అవుతూ వుంటుంది. అలాంటప్పుడు మీ పెరట్లో దానిమ్మ లేదా అరటి మొక్క నాటి… రోజూ సాయం కాలం వేళ దాని దగ్గర దీపం వెలిగించండి. ఇలా అనుసరిస్తూ సోమవారం, శుక్రవారం శ్రీ సూక్తం పఠించాలి. ఈ పద్ధతిని కనుక మీరు పాటించారంటే మీ ఇంట్లో లక్ష్మీ దేవి స్థిరనివాసియై వుంటుంది.

శుక్రవారం పూట శ్రీ యంత్రం, కనక ధార యంత్రం, కుబేర యంత్రం మీ దేవుడి దగ్గర పెట్టి ప్రతీ రోజూ పూజిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని పండితులు అన్నారు. శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయాలి. ఆ ఉప్పును కాళ్ళ తో తొక్క కూడదు గుర్తుంచుకోండి. అలాగే బదులు కూడా తీసుకోకూడదు. ఉప్పును చేతి తో ఎవ్వరికీ ఏ రోజైనా ఇవ్వకూడదు మీకు తెలిసే ఉంటుంది.

ధన లాభం కలగడానికి శుక్రవారం, శనివారం సాయంత్రం సంధ్య వేళ రెండు మినప వడలు పెద్దవి తయారు చేసి వాటి పై కొంచెం పెరుగు, సింధూరం చిలకరించాలి. ఆ తరువాత రావి చెట్టు కింద ఆ రెండు వడలని ఉంచాలి. అలా పెట్టేసాక వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా ఈ పద్ధతిని 21 రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తే ధన లాభం కలుగుతుంది.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news