దక్షిణాయనంలో ఏమి చేయాలి ?

-

సాధారణంగా ఆషాఢమాసంలో దక్షిణాయనం వస్తుంది. ఈసారి జూలై 16న దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. అయితే ఆషాఢంలోని తొలి ఏకాదశి నుంచి చాలామంది సన్యాసులు, స్వామీజీలు, పండితులు చాతుర్మాస్య దీక్షను ప్రారంభిస్తారు. నాలుగు నెలల దీక్ష అయిన చాతుర్మాస్యం దక్షిణాయనం లోనే వస్తుంది. చాతుర్మాస్యం నాలుగు మాసాలూ కూడా ఈ కాలంలోనే ఉండడం వల్ల ఈ సమయంలో విష్ణు మూర్తి ఆరాధన విశేష ఫలాలు ఇస్తుంది. దక్షిణాయనంలో ముఖ్యంగా చేపట్ట్టవలసిన కార్యక్రమాలు కొన్ని పెద్దలు చెబుతారు.

వాటిలో కొన్ని.. ధ్యానం, మంత్ర జపాలు చేయడం, సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు చేయడం, పిండ ప్రదానాలు, పితృ తర్ఫణాలు వంటివి చేయడం, సాత్వికాహారం (శాకాహారం) తీసుకోవడం, అవసరంలో ఉన్న వారకి దానం చేయడం, అన్నదానం, తిల (నువ్వుల ) దానం, వస్త్ర దానం, విష్ణు పూజ, విష్ణు సహస్రనామం చేయడం, సూర్యరాధన, ఆదిత్య హృదయ పారాయణ ఇటువంటివి చేస్తే అవి శరీరానికి, మనస్సుకు మంచి చేస్తాయి. పాపాలు తొలగిపోతాయి. వీటితోపాటు ఈ కాలంలో అనేకానేక పండుగలు, దీక్షలు, వ్రతాలు వస్తాయి. వాటిని ఆచరించి కాలానుగుణంగా శరీరాన్ని, మనసును అదుపులో పెట్టుకొని సత్‌మార్గంలో ప్రయాణిస్తే జీవితానికి సార్థకత చేకూరుతుంది.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Exit mobile version