తీర్థం తీసుకున్న త‌ర్వాత చేతిని త‌ల‌పై రాసుకుంటే ఏంమ‌వుతుంది..

-

సాధార‌ణంగా చాలా మంది దేవాల‌యాల‌కు వెళ్తుంటారు. అక్కడ పూజారితో పూజలు, వ్రతాలు చేయించుకుంటాం.  అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తాం.  పూజలు, వ్రతాలు చేసినప్పుడో తీర్థం తీసుకుంటూ ఉంటాము. అయితే మ‌నం గుడికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ‌ మనకు తెలియ కుండానే చేతులు దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటాయి. రెండవది తీర్థం తీసుకుని తాగి మన చేతులను తలపై రాసుకుంటాము.

వాస్త‌వానికి చేతులు ప్రార్థన చేస్తే తప్పు లేదు కానీ తీర్థంన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదు అంటున్నాయి శాస్త్రాలు. సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి మన జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని అంటున్నారు.

తీర్థం తీసుకున్నప్పుడు మన చేయి ఎంగిలి అవుతుంది. ఎంగిలి చేతిని తలకు రాసుకోవడం మంచిది కాదు. అందుకే తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు. అయితే గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థంన్ని మాత్రమే తల‌కు రాసుకోవ‌చ్చ‌ట‌. సో.. తీర్థం తీసుకున్న తర్వాత మీ చేతిని ఎప్పుడూ కూడా త‌ల‌కు రాసుకోవడం వంటివి చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news