మహాదేవుడు పరమశివుడు ఎంతటి కారుణ్యమూర్తో అందరికీ తెలుసు. తన శరీరంలో సగభాగాన్ని పార్వతీ దేవీకి ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. పూర్వం మార్కండేయునికి మరణ సమయం ఆసన్నమైన వేళ శివ స్తోత్రాన్ని ప్రారంభించాడు. యముడు పాశాన్ని పెట్టి మార్కండేయున్ని లాగబోతే శంకరుడు తన కాలితో ఒక్క తన్ను తన్నాడు. అంతే యముడు పారిపోయాడు. ఆ గర్వంతో శంకరుడు, పార్వతితో చూసావా..? యముడంతడి వాడిని బెదిరించి పంపాను ఒక్క కాలితోపుతో మార్కండేయున్ని రక్షించాను ఒంటి కాలితో అన్నాడు.
అమ్మ పార్వతీ దేవి నిదానంగా నవ్వుతూ.. స్వామీ! అర్థనారీశ్వర రూపంలో నావైపున ఉండే ఎడమకాలితో తన్నారనే విషయాన్ని మర్చిపోయారు మీరు. అది నా కాలు. అన్నది అంతే పరమశివుడు సిగ్గుతో ముఖాన్ని వేరే వైపునకు తిప్పుకున్నాడు. అదండి సంగతీ.. శివుడు సిగ్గు పడ్డ వేళ ఇదే!!
-కేశవ