మా ఆయన సమంత మోజులో పడ్డాడు.. ఎలా కంట్రోల్ చేయాలి..!

-

అక్కినేని కోడలిగా మారాక కూడా సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లి తర్వాత సమంత మునుపటి ఫాంను కొనసాగిస్తుంది. లేటెస్ట్ గా నాగ చైతన్యతో కలిసి సమంత చేస్తున్న సినిమా మజిలి. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరు కలిసి ప్రేమలో ఉన్న సందేహాలను క్లియర్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది చైతుకి.. అదేంటి అంటే మా ఆయనకు సమంత అంటే చాలా ఇష్టం.. ఆయన్ను సమంత మోజు నుండి బయట పడేయడం ఎలా అని ప్రశ్న అడిగింది ఒక అభిమాని. అయితే దానికి సమాధానంగా అతన్ని తన దగ్గరకు పంపించండి అని చైతు సమాధానం ఇచ్చాడు. నాగ చైతన్య, సమంత ఇద్దరు కలిసి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కొందరు ఆకతాయి ప్రశ్నలు అడుగగా కొందరు మాత్రం సీరియస్ లవ్ క్వశ్చన్స్ అడిగారు.

ఏదైనా సిన్సియర్ గా ట్రై చేస్తే సక్సెస్ అవుతుందని అన్నారు చైతు, సమంత. ఏమాయ చేసావే సినిమాలో కలిసి పనిచేసి అప్పటి నుండి రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరు 2017 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి నటిస్తున్న సినిమా ఇదే అవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version