మహారాష్ట్ర ప్రభుత్వం పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉన్న షిరిడి విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పత్రీయే సద్గురు సాయిబాబా జన్మస్థలం అంటూ కొందరు వాదిస్తున్నారు. 1999లో అక్కడ శ్రీ సాయి జన్మస్థాన్ మందిరాన్ని నిర్మించారు. భక్తులు భారీగా రావడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం పత్రిలోని సాయిబాబా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించింది.
ఇక్కడి నుంచి అసలు వివాదం మొదలయింది. పత్రిని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం చేసిన ప్రకటనపై షిరిడీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మండిపడింది. నిరసనగా రేపటి నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. అయితే పత్రీ ఆలయం గురించి ఇప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు. షిర్డీనే సాయి బాబా ఆలాయం అనుకుంటారు.
అయితే అయితే 1854లో 16 ఏళ్ల వయస్సులో సాయి.. షిరిడీకి వచ్చారని.. తొలుత ఓ వేపచెట్టుకింద సాయి బాబా కనిపించారని, షిరిడీకి 275 కిలోమీటర్ల దూరంలో పర్బాని జిల్లాలో పత్రి అనే ఊరిలో సాయి బాబా జన్మించారని అంటున్నారు. అయితే ఆయన అసలు పేరు కూడా ఎవరికి తెలియదట. దీనితో ఖండోబా పూజారి ఒకరు సాయి అని నామకరణం చేసినట్టు చెప్తారు. షిరిడీ సాయిబాబా కర్మభూమి అయితే… పత్రి జన్మభూమి అంటున్నారు.