Akshaya tritiya : అక్షయ తృతీయ అంటే మనకి మొట్ట మొదటి గుర్తొచ్చేది బంగారం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని చాలా మంది కొంటూ ఉంటారు. బంగారాన్ని కానీ వెండి లేదంటే విలువైన వాటిని కొంటుంటారు అక్షయ తృతీయ నాడు ఏం కొంటే అది అక్షయమవుతుందని అంటారు. అక్షయ తృతీయ నాడు కొన్నది అక్షయమవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అక్షయ అంటే తరగనిది.
అక్షయ తృతీయ అంటే నేటి కాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదైనా విలువైన వస్తువుల్ని కొనడం అనే ప్రచారం ఉంది. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం, పిల్లల్ని స్కూల్లో చేర్చడం, పుస్తక ఆవిష్కరణ, పుణ్యస్థలాలని చూడడానికి వెళ్లడం వంటి మంచి కార్యాలను చేస్తారు. గృహ నిర్మాణం ఇంటి స్థలాన్ని కొనడం, బావులని తవ్వడం వంటివి కూడా చేస్తూ ఉంటారు.
నిజానికి అక్షయ తృతీయనాడు ఏ పని చేసినా కూడా అది అక్షయం అంతమవుతుంది ఎప్పటికీ నిలిచిపోతుంది అని అంటారు. అందుకే అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులని ముఖ్యంగా బంగారాన్ని కొంటారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి అన్న విషయం మనకి తెలుసు. ఆమె అనుగ్రహం కలిగితే చాలు.
మనకు జీవితంలో ఎటువంటి లోటు ఉండదు అందుకని లక్ష్మీ దేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదిన రోజున లక్ష్మీ దేవికి పూజలు చేస్తారు. బంగారం అంటే సంపదకి చిహ్నం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే ఏడాది మొత్తం సంపద ఉంటుందని బంగారం కొంటారు. ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు అందుకే కొంచమైనా సరే బంగారాన్ని కొని భగవంతుడుని పూజిస్తారు.