పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. కార్తీక మాసంలో పెట్టే దీపానికి కానీ చేసే పూజకి కానీ నదీ స్నానానికి కానీ ఎంతో విశిష్టత ఉంది. పైగా వీటిని ఆచరించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. చక్కటి ఫలితం ఉంటుంది. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు, ఉసిరికాయకు అభినవభావ సంబంధం ఉంది. అయితే కార్తీకమాసంలో చాలామంది ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. దీని వలన మంచి ఫలితం కనబడుతుందట. అసలు ఎందుకు కార్తీకమాసంలో ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలి అనే దాని గురించి ఎప్పుడు చూద్దాం… సూర్యోదయంతో తలస్నానం చేసి పరమేశ్వరుడికి కానీ విష్ణువుకి కానీ ఉసిరి దీపాన్ని వెలిగించొచ్చు.
దేవాలయానికి వెళ్లి ఒక మంచి ప్రదేశంలో నీటితో శుభ్రం చేసి వరి పిండితో ముగ్గు వేయాలి. ఆ తర్వాత కుంకుమతో అలంకరించి ఉసిరికాయని తీసుకుని పై భాగం తీసేసి… ఆవు నెయ్యిని పోసి తామర కాడలతో చేసిన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే ఎంతో ఇష్టం.
ఉసిరికాయ దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీదేవితో పాటుగా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. శివపురాణంలో ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం అని వర్ణించబడింది. కార్తీకమాసంలో ఏకాదశి రోజు, పౌర్ణమి, సోమవారం నాడు ఉసిరి చెట్టు కింద దీపాలు పెడితే మంచిదట. శుభం కలుగుతుందట. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా అష్ట దరిద్రలు పోతాయి. అలాగే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది.