
ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ వద్ద అరెస్ట్ చేసిన ఉపాధ్యాయ నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన టీచర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమని తప్పుబట్టారు. 317 జీఓ రద్దు అయ్యే వరకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.