కరీంనగర్ : నెంబర్ ప్లేట్ లేని బైక్ లు సీజ్

-

రవాణాశాఖ నిబంధనలు ఉల్లంఘించి నంబర్ ప్లేట్ లు లేకుండా తిరుగుతున్న 45 వాహనాలను పెద్దపల్లి పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి నంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ACP సారంగపాణి మాట్లాడుతూ నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు ముందు, వెనుక వైపు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news