కాకతీయ యూనివర్సిటీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో పిజి సెక్షన్లో మరొక ఉద్యోగి కరోనా భారిన పడ్డాడు. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ అధికారులు పరీక్షల విభాగమంతా శానిటైజేషన్ చేయించారు. అదే విధంగా కేయూ దూరవిద్యా కేంద్రంలోనూ ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది.