రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మీర్‌పేట వివాహిత హత్య కేసు రోజుకో కీలక మలుపు తీసుకుంటుంది. నిందితుడు గురుమూర్తి తన భార్యను హత్య చేశాక పోలీసులకు దొరకకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులను ఉపయోగించినట్లు తెలుస్తోంది. మళయాళి తెలుగు వర్షన్ మూవీ సూక్ష్మ దర్శినిని చూసి భార్యను గురుమూర్తి హత్య చేసినట్లు సమాచారం.
సూక్ష్మ దర్శిని సినిమాలో తరహాలో మాధవి మృతదేహాన్ని గురుమూర్తి డిస్పోస్ చేశాడు. కెమికల్స్‌లో నానబెట్టి కాల్చి మృతదేహాన్ని పొడిగా మార్చి.. ఆ పొడిని చెరువులో చల్లినట్లు తెలుస్తోంది. తన భార్యను తానే హత్యచేసినట్లు అంగీకరించినా సరైన ఆధారాలు లేక పోలీసులు ముందుకు వెళ్లలేకపోతున్నారు. అయితే, బ్లూ రేస్ టెక్నాలజీతో క్లూస్ టీం ఆధారాలు సేకరించిన విషయం తెలిసిందే. డీఎన్‌ఏ టెస్టుకు సైతం బ్లడ్ శాంపిల్స్ పంపారు. అందులో డిటేయిల్స్ మ్యాచ్ అయితే
సాయంత్రంలోగా గురుమూర్తి పైన పోలీసులు యాక్షన్ తీసుకోనున్నారు.