కమాన్‌పూర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని 9 గ్రామాల్లో పాలిథిన్, ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. మండలంలో తొమ్మిది గ్రామాలుండగా దాదాపు 25 వేల జనాభా ఉంటుంది. మండల కేంద్రంలో ఎక్కువగా కిరాణ, వస్త్ర, టిఫిన్, మాంసం దుకాణాలు ఉంటాయి. పాలిథిన్ కవర్ల వినియోగంపై ఎక్కడ అవగాహన లేదు. దీంతో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.