నిరుద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌..వైద్యశాఖలో 30 వేల ఉద్యోగాల భర్తీ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వైద్య శాఖలో ఖాళీ గా ఉన్న 30 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటన చేశారు. కోవిడ్ ను ధీటుగా ఎదుర్కునేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన వివిధ అత్యాధునిక ఆక్సిజన్ సదుపాయాలను ప్రారంభించారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడితే… 74 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసామని… 163 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పీడియాట్రిక్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు.

jagan

గతంలో కనీసం ఒక్క VRDL ల్యాబ్ కూడాలేని పరిస్థితి నుండి నేడు 20 అత్యాధునిక RTPCR వైరల్ (VRDL) ల్యాబులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు సీఎం వైయస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్ లైన్లు. రూ. 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ ఐఎస్ఓ కంటైనర్లు ఏర్పాటు చేశామని… కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నప్పటికీ నాడు-నేడు ద్వారా ఆస్పత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల పై 30% సబ్సిడీ ఇస్తున్నామని… సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ ను ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చిందని ప్రకన చేశారు. ఇకపై ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌలభ్యమవుతుందని…. ఆస్పత్రుల ఆవరణలోనే ప్లాంట్ ఏర్పాటు జరుగుతుందన్నారు సీఎం వైయస్ జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version